గోవును జాతీయ మాతగా ప్రకటించాలని డిమాండ్ – బీర్కూర్‌లో సంతకాల సేకరణ, ర్యాలీ
On
బీర్కూర్, ఏప్రిల్ 27 (డిడి9 వార్త):
బీర్కూర్ మండలంలో గోసంరక్షణ ఆహ్వాన్ అభియాన్ ఆధ్వర్యంలో గోవును జాతీయ మాతగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ సోమవారం అన్ని గ్రామాల్లో విస్తృతంగా సంతకాల సేకరణ చేపట్టారు.ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.అనంతరం కామప్ప చౌరస్తా నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.
అక్కడికి చేరుకున్న అనంతరం తహసీల్దార్ కి వినతిపత్రం సమర్పించారు.ఈ కార్యక్రమంలో గోసంరక్షణ ఆహ్వాన్ అభియాన్ మండల అధ్యక్షుడు మాదరి శేఖర్, భరత్, గోమాత సేవకులు నాగెళ్ల సాయికిరణ్, మల్లెల యోగేష్, పోంచు గోండ, చేపూరి హనుమాన్లు, వడ్ల బసవరాజ్, సాయిబాబా, ప్రవీణ్, గురుస్వామి పండరి, బలరాం, నిఖిల్, రమేష్ తదితర యువకులు పాల్గొన్నారు.
Views: 31
Tags:
About The Author
Related Posts
Latest News
03 Sep 2026 23:48:46
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు....

