బరంగేడ్గిలో దుర్వాసన వెదజల్లుతున్న డ్రైనేజీలు – కాలనీవాసుల ఆగ్రహం

బీర్కూర్, ఏప్రిల్ 29(డిడి9 వార్త):

బీర్కూర్ మండలంలోని బరంగేడ్గి గ్రామంలో పారిశుధ్య పరిస్థితి దారుణంగా మారింది. గ్రామంలోని డ్రైనేజీలు చెత్తాచెదారంతో నిండిపోయి దుర్వాసన వెదజల్లుతున్నాయి.దీంతో కాలనీవాసులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.ఇప్పటికే పలుమార్లు సంబంధిత అధికారులకు విన్నవించుకున్నప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.డ్రైనేజీలను శుభ్రం చేయకపోవడం వల్ల దోమలు,ఈగలు విపరీతంగా పెరిగి వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని వారు అంటున్నారు.పాలకులు,అధికారులు నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నారని మండిపడిన ప్రజలు,వెంటనే డ్రైనేజీలను శుభ్రపరిచి గ్రామంలో పారిశుధ్యాన్ని మెరుగుపరచాలని డిమాండ్ చేస్తున్నారు. సమస్యను పట్టించుకోకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తున్నారు.

Views: 92
Tags:

About The Author

Related Posts

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు