అందరి భాగస్వామ్యంతోనే సత్వర ప్రగతి: కలెక్టర్ ఇలా త్రిపాఠి

బోధన్‌లో విజయవంతంగా నియోజకవర్గ స్థాయి ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ సభ

అందరి భాగస్వామ్యంతోనే సత్వర ప్రగతి: కలెక్టర్ ఇలా త్రిపాఠి

మహిళా సంఘాలకు రూ. 3.80 కోట్ల కమిషన్ చెక్కు పంపిణీ

ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరాలన్నా, అభివృద్ధి ఫలాలు క్షేత్రస్థాయికి చేరాలన్నా ప్రజా భాగస్వామ్యం అత్యంత ఆవశ్యకమని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉద్ఘాటించారు. శనివారం బోధన్‌లోని ఆచన్‌పల్లిలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణ సభలో ఆమె ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి అందాలన్నదే అధికారుల ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు.

​రాష్ట్ర ముఖ్యమంత్రి సందేశాన్ని సభలో చదివి వినిపించిన కలెక్టర్, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, గృహజ్యోతి వంటి పథకాల అమలు తీరును వివరించారు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు సెల్ఫ్ ఫోటో క్యాప్చరింగ్ విధానం ద్వారా పారదర్శకంగా తమ పురోగతిని వెల్లడించవచ్చని, త్వరలోనే రెండో విడత మంజూరీ ప్రక్రియ కూడా ప్రారంభమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో మహిళల కోసం బీమా పథకాన్ని, విద్యార్థుల కోసం అల్పాహార పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టనుందని పేర్కొన్నారు. విద్యా రంగానికి పెద్దపీట వేస్తూ బెల్లాల్‌ శివారులో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఈ ప్రాంత విద్యార్థులకు వరంలా మారుతుందన్నారు.

​ధాన్యం సేకరణలో రైతులకు ఎక్కడా ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని, అకాల నష్టాల పాలైన రైతులకు పరిహారం అందజేస్తామని కలెక్టర్ భరోసా ఇచ్చారు. ఇదే వేదికపై నుంచి మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, కమిషన్ రూపంలో సమకూరిన రూ.3.80 కోట్ల చెక్కును పంపిణీ చేయడంతో పాటు, 100 మంది అంగన్‌వాడీ కార్యకర్తలకు నూతన మొబైల్ ఫోన్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పద్మ శరత్ రెడ్డి మాట్లాడుతూ పట్టణాభివృద్ధికి స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పూర్తి సహకారం అందిస్తున్నారని తెలిపారు. జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్, డీడబ్ల్యూఓ పద్మ తదితర జిల్లా స్థాయి అధికారులు ఈ సభలో పాల్గొన్నారు.

IMG_20260502_180957

Views: 46
Tags:

About The Author

Latest News