పోతంగల్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా సాజి పటేల్ ఏకగ్రీవం

పోతంగల్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా సాజి పటేల్ ఏకగ్రీవం

నిజామాబాద్ జిల్లా  పోతంగల్ మండల కేంద్రంలో శనివారం 14 గ్రామాల సర్పంచులు సమావేశమై మండల సర్పంచుల ఫోరం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి మార్కెట్ కమిటీ చైర్మన్ గాయక్వాడ్ హనుమంతు ముఖ్యఅతిథిగా హాజరై నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. ఫోరం అధ్యక్షుడిగా పోతంగల్ సర్పంచ్ సాజి పటేల్ ఎన్నిక కాగా, ఉపాధ్యక్షుడిగా వివేక్ జలపల్లి (సుంకిని), సెక్రటరీగా ఫెరోజ్ (హంగర్గా ఫారం), క్యాషియర్‌గా సునీల్ (కారేగాం) బాధ్యతలు చేపట్టారు.  సలహాదారులుగా జగన్ (కొల్లూరు), కనకమెడల వాసు (బాకర్ ఫారం), రామ్ రెడ్డి (కల్లూరు), సంజు పటేల్, రాజు (జలపల్లి) నియమితులయ్యారు. ఈ సందర్భంగా సర్పంచుల ఫోరం సభ్యులు మాట్లాడుతూ.. మండలంలోని 14 గ్రామాల్లో ఏ సమస్య ఎదురైనా అందరమూ ఒకే యూనిట్‌గా ఉండి, ఐక్యమత్యంతో ముందుకు సాగుతామని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నీరడి గంగాధర్, మాజీ ఎంపీపీ గంధపు పవన్, మాజీ మండల అధ్యక్షుడు ఎజాజ్ ఖాన్, మండలంలోని 14 గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.

Views: 4
Tags:

About The Author

Related Posts

Latest News

వార్షిక పద్దుపై కసరత్తు.. నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వార్షిక పద్దుపై కసరత్తు.. నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం
తెలంగాణ రాష్ట్ర రాజకీయ, పరిపాలనా ముఖచిత్రంలో నేడు మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. సచివాలయ వేదికగా మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర...
బాన్సువాడలో ఉద్రిక్తతలకు చెక్ – 3 గంటల్లో పరిస్థితి అదుపులోకి, 19 మంది అరెస్ట్
దేవాదులకు సీఎం రేవంత్ 'జల' సిరి.. భూసేకరణకు రూ. 600 కోట్లు!
పేదల కల సాకారం — బరంగ్ ఏడ్గిలో ఇందిరమ్మ ఇంటి ప్రారంభం
చేతన్‌నగర్‌లో ఉచిత వైద్య శిబిరం
పోతంగల్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా సాజి పటేల్ ఏకగ్రీవం
భీంగల్ మున్సిపల్ పాలకవర్గానికి ఘన సన్మానం