పేదల కల సాకారం — బరంగ్ ఏడ్గిలో ఇందిరమ్మ ఇంటి ప్రారంభం

బీర్కూర్, ఫిబ్రవరి 22 :
మండలంలోని బరంగ్ ఏడ్గి గ్రామానికి చెందిన చైనాపురం శాంతాబాయి – పీరాజీ పటేల్ దంపతులకు నిర్మించిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు గోండ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి సహకారంతో గ్రామంలోని పేదలు నిర్మించుకుంటున్న ఇందిరమ్మ ఇండ్లకు పార్టీలకు అతీతంగా తమ సహకారం అందిస్తామని తెలిపారు.గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లతో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తామని, గ్రామ ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ గోండ్ల రాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదేపురం గంగన్న, కుమ్మరి గంగారాం, నాగుగొండ, చైనాపురం కామప్ప, హట్కరి దశరథ్, సాలె సాయిబాబు, సందుల రవి, క్యాదని లింగప్ప, నీరడి రాములు, బోయి సాయిలు, గైని నడిపి సాయిలు, పుల్కంటి శ్రీను, క్యాదెని లక్షప్ప తదితరులు పాల్గొన్నారు.

Views: 59
Tags:

About The Author

Related Posts

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు