కారేపల్లి పాఠశాల విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ

కారేపల్లి పాఠశాల విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ

భీమ్గల్ మండలంలోని కారేపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో శనివారం ఉచితంగా పుస్తకాలు, పెన్నులను పంపిణీ చేశారు. జనసేన పార్టీ సామాజిక బాధ్యతలో భాగంగా పేద విద్యార్థులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టినట్లు పార్టీ ప్రతినిధులు వెల్లడించారు. ఈ సందర్భంగా భీమ్గల్ జనసేన కోఆర్డినేటర్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. రేపటి తరానికి నాణ్యమైన విద్యను అందించడమే జనసేనాని ఆశయమని, ఆ లక్ష్య సాధన కోసమే ఇలాంటి సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులను ఉద్దేశించి ఆయన చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు దామా నవీన్, రామావత్ తిరుపతి, గుగులోత్ ఓం శ్రీనివాస్, అనిల్ తో పాటు కారేపల్లి గ్రామస్థులు ప్రేమ్, రామ్, పరమేష్, సురేష్, నాగరాజు మరియు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Views: 25
Tags:

About The Author

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు