బోధన్ మున్సిపాలిటీలో బీజేపీ కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం

బోధన్ మున్సిపాలిటీలో బీజేపీ కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం

బోధన్ మున్సిపాలిటీలో నూతనంగా ఎన్నికైన భారతీయ జనతా పార్టీ వార్డు అభ్యర్థులు శనివారం కౌన్సిలర్లుగా ప్రమాణ స్వీకారం చేశారు. మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ వికాస్ మహతో నూతన కౌన్సిలర్లచే ప్రమాణం చేయించారు. 33వ వార్డు కౌన్సిలర్‌గా గుత్తా అబ్బవ్వ, 29వ వార్డు కౌన్సిలర్‌గా రాజుల దేవి లక్ష్మీ పూజిత మరియు 11వ వార్డు కౌన్సిలర్‌గా కోలిపాక రేణుక పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ నూతన కౌన్సిలర్లు తమ వార్డుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. తమపై నమ్మకంతో గెలిపించిన వార్డు ప్రజల సమస్యల పరిష్కారమే ప్రథమ కర్తవ్యంగా ముందుకు సాగుతామని ఈ సందర్భంగా బీజేపీ కౌన్సిలర్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.10

Views: 12
Tags:

About The Author

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు