పురాణే అజయ్ కుమార్ కు పంప మహాకవి పురస్కారం

పురాణే  అజయ్ కుమార్ కు  పంప మహాకవి పురస్కారం

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం హైదరాబాద్‌లో అక్షరయాన్ తెలుగు ఉమెన్స్ రైటర్ ఫౌండేషన్, అభిజ్ఞ భారత్ ఆర్గనైజేషన్ మరియు సీత చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పంపా సాహితి పీఠం అధ్యక్షులు పురాణి అజయ్ కుమార్  ప్రతిష్టాత్మకమైన పంప మహాకవి పురస్కారాన్ని అందజేశారు. మహారాష్ట్ర మాజీ గవర్నర్ శ్రీ సిహెచ్ విద్యాసాగర్ రావు, ప్రముఖ కవి డాక్టర్ మామిడి హరికృష్ణ, ప్రముఖ రచయిత్రి శ్రీమతి అయినంపూడి శ్రీలక్ష్మి  కరకమల మీదుగా ఆయన ఈ సన్మానాన్ని, పురస్కారాన్ని అందుకున్నారు. మాతృభాషను గౌరవించుకుంటూ సాహిత్య రంగంలో విశేష కృషి చేస్తున్న వారిని గుర్తించి ఈ పురస్కారాన్ని అందజేయడం పట్ల నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, భాషాభిమానులు, సాహితివేత్తలు పాల్గొన్నారు.

Views: 11
Tags:

About The Author

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు