భీంగల్ మున్సిపల్ పాలకవర్గానికి ఘన సన్మానం

భీంగల్ మున్సిపల్ పాలకవర్గానికి ఘన సన్మానం

భీంగల్ పట్టణంలోని మూడు గైండ్ల సంఘాల ప్రతినిధులు శనివారం మున్సిపల్ చైర్‌పర్సన్ బొదిరే గంగామణి స్వామి, మున్సిపల్ పాలకవర్గాన్ని ఘనంగా సన్మానించారు. పట్టణ అభివృద్ధిలో భాగస్వాములవుతున్న పాలకవర్గానికి సంఘం తరపున కృతజ్ఞతలు తెలుపుతూ ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ గంగామణి స్వామి మాట్లాడుతూ.. తమపై నమ్మకంతో సన్మానించిన మూడు గైండ్ల సంఘాల సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సంఘాలకు సంబంధించిన ఆలయాల అభివృద్ధికి, ఇతర సమస్యల పరిష్కారానికి తమ పాలకవర్గం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పట్టణంలోని అన్ని వర్గాల సహకారంతో భీంగల్‌ను మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ పాలకవర్గ సభ్యులు, మూడు గైండ్ల సంఘాల ప్రతినిధులు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Views: 22
Tags:

About The Author

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు