30న బోధన్‌లో మహనీయుల జయంతి ఉత్సవాలు

30న బోధన్‌లో మహనీయుల జయంతి ఉత్సవాలు

ఎస్సీ, ఎస్టీ హక్కుల పరిరక్షణ కమిటీ బోధన్ డివిజన్ ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీన మహనీయుల జయంతి ఉత్సవాలను నిర్వహించనున్నట్లు కమిటీ కన్వీనర్, న్యాయవాది నీరడి ఈశ్వర్ తెలిపారు. ఆదివారం బోధన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బోధన్ పట్టణం    అంబేద్కర్ చౌరస్తాలో ఈ వేడుకలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఐదో ఏడాది ఉత్సవాలు

గత ఐదేళ్లుగా ఏప్రిల్ 30న ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నామని, ఈ ఏడాది కూడా మహాత్మా జ్యోతిరావు పూలే, డా.బి.ఆర్. అంబేద్కర్, బాబూ జగజీవన్ రామ్, సంత్ సేవాలాల్ మహారాజ్ వంటి మహనీయుల జయంతి వేడుకలను వైభవంగా నిర్వహించనున్నట్లు ఈశ్వర్ వివరించారు. ఈ కార్యక్రమంలో కమిటీ గౌరవ అధ్యక్షులు పరిమి కోటేశ్వరరావు, కో-కన్వీనర్లు నీరడి రవి, మాచుకూరి దేవేందర్, సింగడే పాండు, సభ్యులు షేరే భీమ్ రావు, విట్టల్, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు

Views: 46
Tags:

About The Author

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు