​రైల్వే బాధితులకు 'ఇందిరమ్మ' ఇళ్లు ఇవ్వాలి

ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుడ్డు గంగాధర్ డిమాండ్

​రైల్వే బాధితులకు 'ఇందిరమ్మ' ఇళ్లు ఇవ్వాలి

నిజామాబాద్ - పెద్దపల్లి రైల్వే లైన్ నిర్మాణం కారణంగా ఇళ్లు కోల్పోయిన బాధితులకు తక్షణమే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం  జిల్లా ప్రధాన కార్యదర్శి దుడ్డు గంగాధర్ డిమాండ్ చేశారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం ఓడ్యాట్‌పల్లి గ్రామంలో బాధితులతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు.
పదేళ్లుగా తీరని వేదన..
​ఈ సందర్భంగా గంగాధర్ మాట్లాడుతూ.. పది సంవత్సరాల క్రితం రైల్వే పట్టాల నిర్మాణం వల్ల గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన సుమారు 20 కుటుంబాలు తమ నివాసాలను కోల్పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో వీరికి ఊరి చివరన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేసినప్పటికీ, అధికారులు, పాలకులు కాలయాపన చేసి చివరకు వాటిని రద్దు చేయడం దారుణమన్నారు. ప్రస్తుతం మరో రైల్వే లైన్ పనులు ప్రారంభమవుతుండటంతో, మరో 15 ఎస్సీ కుటుంబాల ఇళ్లు కూలిపోయే ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రజాప్రతినిధులు పట్టించుకోరా?
​సొంత గూడు కోల్పోయిన బాధితులు అద్దె ఇళ్లలో ఉంటూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమస్యపై స్థానిక ఎంపీని, ఆర్మూర్ ఎమ్మెల్యేను ఎన్నిసార్లు కలిసినా ఫలితం లేకుండా పోయిందని గంగాధర్ విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో స్పందించి బాధితులకు న్యాయం చేయాలని కోరారు.
Views: 52
Tags:

About The Author

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు