పరీక్షల పట్ల భయం వద్దు : డిప్యూటీ తహసీల్దార్ మోహన్
తట్టికోట ప్రభుత్వ పాఠశాలలో పలకల పంపిణీ
By R.Suresh
On
విద్యార్థులు క్రమశిక్షణ, సమయపాలన, దృఢ సంకల్పంతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని బోధన్ మండల్ లెవెల్ స్టాక్ పాయింట్ డిప్యూటీ తహసీల్దార్ మోహన్ ఆకాంక్షించారు. బోధన్ పట్టణంలోని తట్టికోట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సామాజిక కార్యకర్త సనా పటేల్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పలకల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పలకలను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షలను విద్యార్థులు ఎలాంటి భయాందోళనలకు లోనవకుండా ఆత్మవిశ్వాసంతో రాయాలని సూచించారు. ప్రస్తుత కాలంలో మొబైల్ ఫోన్‌లకు బానిస విద్యార్థులు క్రమశిక్షణ, సమయపాలన, దృఢ సంకల్పంతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని బోధన్ మండల్ లెవెల్ స్టాక్ పాయింట్ డిప్యూటీ తహసీల్దార్ మోహన్ ఆకాంక్షించారు. బోధన్ పట్టణంలోని తట్టికోట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సామాజిక కార్యకర్త సనా పటేల్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పలకల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పలకలను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షలను విద్యార్థులు ఎలాంటి భయాందోళనలకు లోనవకుండా ఆత్మవిశ్వాసంతో రాయాలని సూచించారు. ప్రస్తుత కాలంలో మొబైల్ ఫోన్‌లకు బానిస కావడం ఆందోళనకరమని, సాంకేతికతను కేవలం విద్యాభ్యాసానికి మాత్రమే ఉపయోగించుకోవాలని హితవు పలికారు.
రాష్ట్ర స్థాయి ప్రతిభకు సన్మానం
ఇదే పాఠశాలకు చెందిన విద్యార్థిని అవంతి చిత్రలేఖనంలో రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచి గుర్తింపు పొందడం పట్ల ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా అవంతిని పాఠశాల తరపున ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కిషోర్, ఉపాధ్యాయులు సురేష్, బసవరాజ్, నయీమ్, చంద్రకళ, సంతోష్ కుమారి, సావిత్రి, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
Views: 18
Tags:
About The Author
Latest News
03 Sep 2026 23:48:46
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు....

