శ్రీ వేద పాఠశాలలో ఉచిత కంటి, దంత వైద్య శిబిరం

శ్రీ వేద పాఠశాలలో ఉచిత కంటి, దంత వైద్య శిబిరం

నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని శ్రీ వేద పాఠశాలలో శనివారం విద్యార్థుల కోసం ఉచిత కంటి, దంత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ కోటగిరి డైమండ్బో, బోధన్ లయన్స్ కంటి ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. సుమారు 500 మంది విద్యార్థులకు వైద్యులు క్షుణ్ణంగా పరీక్షలు నిర్వహించారు. కంటి వైద్య నిపుణులు డాక్టర్ అజయ్ విద్యార్థులకు దృష్టి లోపాలను పరీక్షించి, అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. దంత వైద్యుడు ఇర్ఫాన్ అలీ విద్యార్థులకు దంత పరీక్షలు నిర్వహించి, నోటి పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. శరీరంలో కళ్లు, పళ్లు అత్యంత కీలకమైన అవయవాలని, వీటిని సంరక్షించుకోవడంపై ప్రతి విద్యార్థి అవగాహన కలిగి ఉండాలని వైద్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ కోటగిరి డైమండ్ అధ్యక్షులు తెల్ల రవికుమార్, పాఠశాల కరస్పాండెంట్ తెల్ల అక్షర, క్యాంప్ ఇంచార్జ్ హనుమంతరావు పటేల్, సభ్యులు కప్ప సంతోష్, కోయగూర శ్రీకాంత్, మోహన్ సెట్, వడ్ల ఉమాకాంత్, పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

Views: 9
Tags:

About The Author

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు