పూలే ఆశయ సాధనకు కదలిరండి

రేపు మహాత్మా జ్యోతిబాపూలే 200వ జయంతి ఉత్సవాలు

పూలే ఆశయ సాధనకు కదలిరండి

సామాజిక విప్లవ పితామహుడు, అణగారిన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిబాపూలే 200వ జయంతి వేడుకలను శనివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సమాజంలో పాతుకుపోయిన అసమానతలపై పోరాడి, విద్యతోనే విముక్తి సాధ్యమని చాటిచెప్పిన పూలే ఆశయాలను నేటి తరానికి చాటిచెప్పేందుకు ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

​ఈ వేడుకల్లో భాగంగా ఉదయం 9 గంటలకు నగరంలోని వినాయక్ నగర్ హనుమాన్ జంక్షన్ విగ్రహాల పార్కులో ఉన్న పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించనున్నట్లు వివరించారు. అనంతరం 10:30 గంటలకు దుబ్బలోని మున్నూరుకాపు సంఘ భవనంలో ప్రభుత్వ అధికారిక సభా కార్యక్రమం జరుగుతుందని, ఈ సభకు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తో పాటు ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరవుతారని తెలిపారు. జిల్లాలోని బీసీ ప్రజలు, సామాజిక కార్యకర్తలు మరియు పూలే అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చి ఈ జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

IMG-20260408-WA0089

 

Views: 7
Tags:

About The Author

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు