సొంతింటి కల సాకారం.. క్షేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణ

సొంతింటి కల సాకారం.. క్షేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణ

ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు రెవెన్యూ యంత్రాంగం క్షేత్రస్థాయిలో దృష్టి సారించింది. పారదర్శకతతో కూడిన పనులు, నాణ్యమైన నిర్మాణాలు సాగేలా చూడటమే లక్ష్యంగా అధికారులు గ్రామాల్లో పర్యటనలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా సాలూర మండలంలోని జాడిజమాల్‌పూర్‌లో ఇందిరమ్మ ఇంటిని నిర్మించుకుని, గృహప్రవేశం చేసిన లబ్ధిదారుడి నివాసాన్ని సాలూర తహసీల్దార్ మహ్మద్ నవాజ్, బోధన్ తహసీల్దార్ విఠల్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా తహసీల్దార్లు మాట్లాడుతూ... ప్రభుత్వం పేదవాడికి సొంతింటి కలను నిజం చేసేందుకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మంజూరైన ఇళ్లను లబ్ధిదారులు ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా, నాణ్యతతో నిర్మించుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో నిర్మాణాలు జరుగుతున్న తీరును పర్యవేక్షిస్తూ, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నామని పేర్కొన్నారు. నిర్మాణ పనుల్లో ఏవైనా సాంకేతిక సమస్యలు లేదా ఇతర ఇబ్బందులు ఎదురైతే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని తహసీల్దార్లు లబ్ధిదారులకు సూచించారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేసుకోవాలని వారు కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ గోగినేని జ్యోతి, ఆర్ మెహర్ ఆనంద్, సీనియర్ అసిస్టెంట్ నజీర్, అమర్, ఫయాజ్ తదితరులు ఉన్నారు.

Views: 77
Tags:

About The Author

Latest News