ప్రజల ఆరోగ్య రక్షణే లక్ష్యంగా పారిశుద్ధ్య పనులు

బీర్కూర్, జూన్ 17(డిడి9 వార్త):

బీర్కూర్ మండలం బరంగేడ్గి గ్రామంలో సర్పంచ్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా మురికి కాలువల శుభ్రత పనులు చేపడుతున్నారు. గ్రామంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపర్చడం, వర్షాకాలంలో నీటి నిల్వలు, దోమల వ్యాప్తిని నివారించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.ఈ సందర్భంగా సర్పంచ్ అనిల్ కుమార్ మాట్లాడుతూ గ్రామ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు పారిశుద్ధ్యం ఎంతో ముఖ్యమని తెలిపారు. గ్రామంలోని ప్రధాన వీధులు, కాలనీల్లో ఉన్న మురికి కాలువలను పూర్తిగా శుభ్రం చేసి, నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.గ్రామ ప్రజలు కూడా తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, చెత్తను కాలువల్లో వేయకుండా సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు లక్కపల్లి హనుమండ్లు, వడ్ల యాదవరావు, కారోబారి పర్వయ్య, సిబ్బంది పాల్గొన్నారు.

Views: 58
Tags:

About The Author

Related Posts

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు