విద్యార్థులకు చెస్ బోర్డుల పంపిణీ

బీర్కూర్, మార్చి 12 (డిడి9 వార్త):

విద్యార్థుల్లో చెస్ ఆటపై ఆసక్తిని పెంపొందించేందుకు చెస్ బోర్డు ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు చెస్ బోర్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ చెస్ ఆట విద్యార్థుల్లో ఆలోచనా శక్తి, ఏకాగ్రత మరియు నిర్ణయ సామర్థ్యాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.విద్యతో పాటు క్రీడలు కూడా విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. ముఖ్యంగా చెస్ వంటి మేధోక్రీడలు పిల్లల్లో తార్కిక ఆలోచనను పెంపొందించి భవిష్యత్తులో ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు దోహదపడతాయని చెప్పారు.ఈ కార్యక్రమంలో ఎంఈఓ వెంకన్న, చెస్ బోర్డు సభ్యులు సిద్ధంశెట్టి నారాయణ, కిరణ్, నాయకులు మియాపురం శశికాంత్, నాగేళ్ల సాయికుమార్, పాఠశాల ఉపాధ్యాయులు దుర్గాప్రసాద్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. చెస్ బోర్డులు అందుకున్న విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.

Views: 4
Tags:

About The Author

Related Posts

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు