హంగర్గా ఫారంలో ఘనంగా 128వ రమాబాయి జయంతి

పోతంగల్, ఫిబ్రవరి 07 (డీడీ9 వార్త):

నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలంలోని హంగర్గా ఫారం గ్రామంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సతీమణి రమాబాయి 128వ జయంతి ఉత్సవాలను శనివారం గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ అంబేద్కర్, రమాబాయి దేశానికి చేసిన సేవలు ఎన్నటికీ మరిచిపోలేనివని అన్నారు. డాక్టర్ అంబేద్కర్ కేవలం దళితులకే కాకుండా, దేశంలోని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేసిన మహనీయుడని కొనియాడారు. ఆయన చేసిన సేవలు జీవితకాలం గుర్తుండిపోతాయని తెలిపారు.ప్రతి సంవత్సరం అంబేద్కర్ జయంతి, రమాబాయి జయంతులను తమ గ్రామంలో అంగరంగ వైభవంగా జరుపుకోవడం ఆనవాయితీగా మారిందని, వారి పట్ల ఉన్న అభిమానంతోనే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని గ్రామస్తులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Views: 28
Tags:

About The Author

Related Posts

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు