వర్ని జాకోరా క్రాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం బస్సు-టిప్పర్ ఢీ, 25 మందికి గాయాలు
On
నిజామాబాద్ వర్ని 09 (డిడి9 వార్త); నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని జాకోరా క్రాస్ వద్ద శుక్రవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది స్థానికుల కథనం ప్రకారం, బడాపహాడ్ నుంచి వర్ణి వైపు వస్తున్న బస్సును, ఎదురుగా వస్తున్న ఇసుక టిప్పర్ వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 25 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి వెంటనే స్పందించిన స్థానికులు 108 అంబులెన్స్‌కు సమాచారం ఇవ్వడంతో, క్షతగాత్రులను హుటాహుటిన వర్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి అక్కడ చికిత్స అందిస్తున్నారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
Views: 167
Tags:
About The Author
Related Posts
Latest News
03 Sep 2026 23:48:46
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు....

