బీర్కూర్‌లో బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

బీర్కూర్, జనవరి 26(డిడి9 వార్త):

దేశం కోసం ప్రాణాలు అర్పించి భారతమాతను బానిస సంకెళ్ల నుంచి విముక్తి చేసిన స్వతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ 77వ గణతంత్ర దినోత్సవాన్ని బీర్కూర్ మండలంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ బీర్కూర్ మండల శాఖ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగురవేశారు.ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు నాగేళ్ల సాయికిరణ్ మాట్లాడుతూ, స్వతంత్ర సమరయోధుల త్యాగాల వల్లే నేడు దేశం స్వేచ్ఛగా అభివృద్ధి పథంలో సాగుతోందని తెలిపారు. దేశ ఐక్యత, సమగ్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు వడ్ల బసవరాజ్, పార్టీ సీనియర్ నాయకులు బీరుగొండ, మదారి శ్రీనివాస్, బీజేపీ నాయకులు పట్టపు గజేందర్తో పాటు పలువురు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. దేశభక్తి నినాదాలతో కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగింది.

Views: 14
Tags:

About The Author

Related Posts

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు