బాన్సువాడలో కార్డన్ సెర్చ్.. 13 బైక్‌లు, ఒక ఆటో స్వాధీనం
బాన్సువాడ, జూలై 29(డీడీ9 వార్త): జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు బాన్సువాడ డీఎస్పీ ఆధ్వర్యంలో బుధవారం బాన్సువాడ మండలం తాడుకోలు గ్రామంలోని రాజారాం దుబ్బా ప్రాంతంలో భారీ ఎత్తున కార్డన్ సెర్చ్ నిర్వహించారు.ఈ తనిఖీల్లో మొత్తం 140 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.పోలీసులు 112 మోటార్‌సైకిళ్లు, 5 కార్లు, 18 ఆటోలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.సరైన వాహన ధ్రువపత్రాలు లేని 13 మోటార్‌సైకిళ్లు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు.వాహనదారులు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే పత్రాలతోనే వాహనాలు నడపాలని పోలీసులు సూచించారు.ఈ సందర్భంగా కాలనీవాసులకు రోడ్డు భద్రతా నిబంధనలు, ఆన్‌లైన్ బెట్టింగ్ వల్ల కలిగే నష్టాలు, సైబర్ నేరాల నుంచి రక్షణ మార్గాలు, గంజాయి నిర్మూలన, మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు.ప్రజలు చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు కోరారు.ఈ కార్యక్రమంలో బాన్సువాడ డీఎస్పీతో పాటు బాన్సువాడ డివిజన్ సీఐలు, ఎస్సైలు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పోలీసుల ఈ ప్రత్యేక తనిఖీలతో తాడుకోలు గ్రామంలో భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టమయ్యాయి.

