ఆత్మ కమిటీ డైరెక్టర్ సందుల రవికి ఘన సన్మానం

బీర్కూర్, మే 31(డిడి9 వార్త): మండలంలోని బరంగ్ ఏడ్గి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ (ఆత్మ) కమిటీ డైరెక్టర్ సందుల రవికి శనివారం గ్రామ కాంగ్రెస్ నాయకులు ఘన సన్మానం నిర్వహించారు. నిగర్వి స్వభావంతో, చిరునవ్వుతో అందరినీ ఆప్యాయంగా పలకరించే సందుల రవికి ఇటీవల ఆత్మ కమిటీ డైరెక్టర్‌గా బాధ్యతలు దక్కిన సందర్భంగా ఈ సన్మానం చేపట్టారు.ఈ సందర్భంగా సందుల రవి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఆత్మ కమిటీ డైరెక్టర్‌గా నియమించిన తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, బాన్సువాడ మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యులు కాసుల రోహిత్లకు కృతజ్ఞతలు తెలిపారు. బరంగ్ ఏడ్గి గ్రామ రైతుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు గోండ్ల శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు కాదేపురం గంగన్న, హొక్నారి అశోక్, ఇందూర్ గజేందర్, బోయి లాలయ్య, కుమ్మరి గంగారాం, గాజుల పండరి, మేత్రి నాగుగొండ, ఫుల్కంటి హన్ముగొండ, నీరడి రాములు, జంగం బసలింగప్ప, హట్కారి దశరథ్, బోయి సాయిలు, గూడెం సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.

Views: 248
Tags:

About The Author

Related Posts

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు