హిందువులంతా ఏకతాటిపైకి రావాలి: సద్గురు సోమలింగ శివాచార్య స్వామీజీ పిలుపు

బోధన్‌లో ఘనంగా హిందూ సమ్మేళనం

హిందువులంతా ఏకతాటిపైకి రావాలి: సద్గురు సోమలింగ శివాచార్య స్వామీజీ పిలుపు

సనాతన హిందూ సంప్రదాయాలు, నైతిక విలువలను కాపాడుకుంటూ, మన సంస్కృతిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సద్గురు సోమలింగ శివాచార్య స్వామీజీ ఉద్ఘాటించారు.

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బోధన్ పట్టణంలో శనివారం హిందూ సమ్మేళనాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. పట్టణంలోని బురుడు గల్లిలో గల విష్ణు మందిరం వద్ద ఏర్పాటు చేసిన ఈ ఆధ్యాత్మిక సమ్మేళనానికి కాలనీవాసులు, హిందూ బంధువులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

​ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సద్గురు సోమలింగ శివాచార్య స్వామీజీతో పాటు గౌరవ అతిథులు కృష్ణ శాస్త్రి, విజయ భాస్కర్, మైస్కర్ సురేఖలు పాల్గొని ప్రసంగించారు. నేటి ఆధునిక కాలంలో హిందూ ధర్మ రక్షణ ఆవశ్యకతను వారు వివరించారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్నతనం నుంచే హిందూ సంప్రదాయాలను అలరింపజేయాలని, వారిలో దేశభక్తి, ధర్మనిష్ఠను పెంపొందించాలని కోరారు. సమాజ హితం కోసం హిందువులంతా ఏకతాటిపై నిలబడాలని పిలుపునిచ్చారు. భక్తిశ్రద్ధల నడుమ సాగిన ఈ సమ్మేళనంలో పట్టణ ప్రముఖులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

 

Views: 9
Tags:

About The Author

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు