జానకంపేట్ వద్ద పోలీసుల ముమ్మర తనిఖీలు

జానకంపేట్ వద్ద పోలీసుల ముమ్మర తనిఖీలు

బక్రీద్ పండుగను పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ వద్ద పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. సీపీ సాయిచైతన్య ఆదేశాల మేరకు ఎస్సై ముత్యాల రామ ఆధ్వర్యంలో ఇక్కడ ప్రత్యేక చెక్‌పోస్టు ఏర్పాటు చేసి నిరంతర నిఘా ఉంచారు. పండుగ వేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పశువులను తరలిస్తే కఠిన చర్యలు ఉంటాయని, రవాణాకు సంబంధించిన అనుమతి పత్రాలు తప్పనిసరిగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. శాంతిభద్రతల పరిరక్షణకు వాహనదారులు సహకరించాలని కోరారు.

 

Views: 13
Tags:

About The Author

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు