పసికందు ప్రాణాల కోసం పోరాటం.. కాపాడండీ సార్

ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై 11 నెలల జష్విక్ - కన్నీరుమున్నీరవుతున్న కానిస్టేబుల్ కుటుంబం.. దాతల సాయం కోసం ఎదురుచూపు

పసికందు ప్రాణాల కోసం పోరాటం.. కాపాడండీ సార్

చికిత్సకు రూ.20 లక్షలు అవసరం.. భద్రత కవరేజ్ రాదన్న అధికారులు

శాంతిభద్రతలను కాపాడే విధుల్లో నిత్యం నిమగ్నమయ్యే ఒక పోలీస్ కానిస్టేబుల్.. నేడు తన 11 నెలల కుమారుడి ప్రాణాలను కాపాడుకోవడానికి దాతల సాయం కోసం ఆర్తిగా ఎదురుచూస్తున్నారు. తీవ్రమైన బ్లడ్ ఇన్‌ఫెక్షన్ కారణంగా కాలేయం, కిడ్నీలు, మెదడు దెబ్బతిని హైదరాబాద్ లోని కొండాపూర్ కిమ్స్ ఆసుపత్రి ఐసీయూలో వెంటిలేటర్‌పై మృత్యువుతో పోరాడుతున్న తన చిన్నారి గంటా జష్విక్‌ను రక్షించుకోవడానికి ఆ తండ్రి పడుతున్న వేదన వర్ణనాతీతం.

కానిస్టేబుల్ గంటా నరేష్ కుమారుడు జష్విక్ క్లిష్టమైన ఆరోగ్య పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. అత్యవసర చికిత్స నిమిత్తం వైద్యులు రూ.20 లక్షలు ఖర్చవుతుందని తేల్చి చెప్పారు. దురదృష్టవశాత్తూ ఈ చికిత్సకు భద్రత ఇన్సూరెన్స్ కవరేజ్ రాదని చెప్పడంతో ఆ కుటుంబం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఉన్నపళంగా అంత సొమ్ము సర్దడం సాధ్యం కాక, ఇప్పటివరకు దాచుకున్నదంతా హారతి కర్పూరంలా కరిగిపోవడంతో తక్షణ ఆర్థిక సాయం కోసం ఆ తండ్రి యావత్ సమాజాన్ని వేడుకుంటున్నారు. ఉదార హృదయులైన దాతలు స్పందించి ఆర్థికంగా అండగా నిలవాలని, తమ చిన్నారిని ప్రార్థనలతో, విరాళాలతో ఆదుకోవాలని కోరుతున్నారు. చిన్నారి జష్విక్ చికిత్స నిమిత్తం నేరుగా తండ్రి ఖాతాకే విరాళాలు పంపవచ్చు. ఫోన్ పే, గూగుల్ పే నెంబర్ 8008689977, 9505853446, ఎస్బిఐ బ్యాంక్ అకౌంట్ నెంబర్ 39073968252 ఐఎసిఎఫ్సి కోడె నెంబర్ : SBIN0020376.

Views: 88
Tags:

About The Author

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు