కుతాడి శంకర్ సేవలు ప్రజలకు ఉపయోగపడాలి – మియాపురం శశికాంత్

బీర్కూర్, మే 28(డిడి9 వార్త):

బీర్కూర్ మండలానికి చెందిన కుతాడి శంకర్ ఆత్మకమిటీ సభ్యుడిగా నూతనంగా ఎన్నుకోబడిన సందర్భంగా బీర్కూర్ యువనాయకుడు మియాపురం శశికాంత్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు.ఈ సందర్భంగా మియాపురం శశికాంత్ మాట్లాడుతూ, కుతాడి శంకర్‌కు వచ్చిన ఈ బాధ్యత ప్రజలకు సేవ చేసే దిశగా మరింత ఉపయోగపడాలని ఆకాంక్షించారు. సమాజ సేవలో ముందుండి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.కుతాడి శంకర్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ అందరికీ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ యమ రాములు, ఉప సర్పంచ్ పరమేశ్ పంతులు, మాజీ ఎంపీపీ రఘు, మేకల విట్టల్,వార్డుమెంబర్ కొరిమె రఘు, ప్రశాంత్యు, అశోక్, సాత్యకిరణ్, పృద్వి,అభిమానులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

Views: 170
Tags:

About The Author

Related Posts

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు