అక్రమ ఇసుక రవాణాపై నిఘా.. టిప్పర్ సీజ్
అర్ధరాత్రి మావంది ఖుర్డు వద్ద పట్టుకున్న తహశీల్దార్ విట్టల్
By R.Suresh
On
నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం కొప్పర్గ మంజీరా నది ప్రాంతం నుంచి ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న ఒక టిప్పర్‌ను గురువారం అర్ధరాత్రి రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. తహశీల్దార్ విట్టల్ తెలిపిన వివరాల ప్రకారం.. కొప్పర్గ నుంచి ఇసుకతో వెళ్తున్న టిప్పర్‌ను మావంది ఖుర్డు వద్ద అధికారులు తనిఖీ చేసి, ఎలాంటి అనుమతులు లేకపోవడంతో దానిని సీజ్ చేశారు. అనంతరం పట్టుబడిన వాహనాన్ని తదుపరి చర్యల నిమిత్తం బోధన్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించినట్లు ఆయన పేర్కొన్నారు.
సమాచారం ఇస్తే చర్యలు..
మండల పరిధిలో ఎక్కడైనా ఇసుక అక్రమ రవాణా జరుగుతుంటే స్థానిక ప్రజలు వెంటనే అధికారులకు సమాచారం అందించాలని తహశీల్దార్ విట్టల్ కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా, అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తూ పట్టుబడితే వాహనాల యజమానులపై, డ్రైవర్లపై కఠిన చట్టపరమైన కేసులు నమోదు చేస్తామని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు.
Views: 20
Tags:
About The Author
Latest News
03 Sep 2026 23:48:46
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు....

