మల్లాపూర్ శివారులో పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి

ఏడుగురు పేకాట రాయుళ్లు అరెస్ట్.. నగదు, బైకులు, సెల్‌ఫోన్లు స్వాధీనం

IMG-20260731-WA0075బాన్సువాడ, జూలై 31 (డిడి9 వార్త): బీర్కూర్ మండలంలోని మల్లాపూర్ గ్రామ శివారులో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై పోలీసులు శుక్రవారం మెరుపు దాడి నిర్వహించి ఏడుగురు పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు.నమ్మదగిన సమాచారం మేరకు బీర్కూర్ ఎస్సై రాములు తన సిబ్బందితో కలిసి దాడి నిర్వహించగా, పేకాట ఆడుతున్న ఏడుగురిని పట్టుకున్నారు.వారి వద్ద నుంచి రూ.12,410 నగదు, మూడు మోటార్‌సైకిళ్లు, ఆరు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.నిందితులపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.ఈ దాడిలో హెడ్ కానిస్టేబుల్ లక్ష్మయ్య, కానిస్టేబుళ్లు తిరుపతి, సంతు, భాను, శివ, హోంగార్డు మొగలయ్య పాల్గొన్నారు. ప్రజలు జూదం, పేకాట వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, అలాంటి సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని ఎస్సై రాములు సూచించారు.

Views: 234
Tags:

About The Author

Related Posts

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు