లారీ ఢీకొని ఏడేళ్ల విద్యార్థిని మృతి

IMG-20260827-WA0023బాన్సువాడ,ఆగస్టు 27(డిడి9 వార్త): బాన్సువాడ పట్టణంలోని తాడ్కోల్ చౌరస్తా వద్ద గురువారం ఉదయం విషాదకర ఘటన చోటుచేసుకుంది. పాఠశాలకు వెళ్తున్న ఏడేళ్ల బాలికను మహారాష్ట్రకు చెందిన లారీ ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.స్థానికుల వివరాల ప్రకారం.. లారీ డ్రైవర్ అతివేగంగా, నిర్లక్ష్యంగా వాహనం నడుపుతూ పాఠశాలకు వెళ్తున్న బాలికను ఢీకొట్టినట్లు తెలుస్తోంది.ప్రమాదంలో బాలిక లారీ టైర్ల కింద పడి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.ప్రమాదానికి గల కారణాలపై వివరాలు సేకరిస్తున్నారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు.బాలిక మృతితో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.వారి రోదనలు అక్కడున్న వారిని సైతం కంటతడి పెట్టించాయి.చిన్నారి మృతితో బాన్సువాడ పట్టణంలో విషాదఛాయలు అలుముకున్నాయి.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

Views: 372
Tags:

About The Author

Related Posts

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు