చేపలు వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి
పోతంగల్, ఫిబ్రవరి (డీడీ9 వార్త):
పోతంగల్ మండలం కోడిచెర్ల గ్రామానికి చెందిన శ్రీనివాస్ (35) చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.
శుక్రవారం ఉదయం ఇంటి నుంచి బయలుదేరిన శ్రీనివాస్ సాయంత్రం వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఆయన కనిపించడంలేదని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, ఎస్సై సునీల్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.ఈ క్రమంలో ఆదివారం పోతంగల్ గ్రామ చెరువులో శ్రీనివాస్ శవమై తేలినట్లు సమాచారం అందింది. ఈ వార్తతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ప్రాథమికంగా చేపలు పట్టే సమయంలో ప్రమాదవశాత్తు నీటిలో జారి మునిగి మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు.శవానికి పంచనామ నిర్వహించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై ఎస్సై సునీల్ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

