బాన్సువాడలో వృద్ధ మహిళ మృతి : చెరువులో తేలియాడుతూ శవం గుర్తింపు
బాన్సువాడ, నవంబర్ 25 (DD9 వార్త):
సంగమేశ్వర కాలనీకి చెందిన వృద్ధ మహిళ మామిడి రాణి (55) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మంగళవారం మధ్యాహ్నం ఎల్లయ్య చెరువు నీటిలో ఆమె శవం తేలియాడుతూ కనిపించడంతో స్థానికుల్లో కలకలం రేగింది.మృతురాలి కోడలు మామిడి లక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం—నిన్న ఉదయం 11.30 గంటలకు తాడుకోల్ రోడ్డులోని యాక్సిస్ బ్యాంకుకు లోన్ పనిమీద రాణిని తీసుకెళ్లింది. అనంతరం మధ్యాహ్నం 3.30 ప్రాంతంలో తాడుకోల్ చౌరస్తాలో ఆటో నుండి దిగిన రాణి, “నేను అవుసులగల్లీకి వెళ్లి నల్లపూసలు అల్లించుకొని వస్తా… నువ్వు ఇంటికి వెళ్లి పో” అని చెప్పి అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లింది.అయితే రాత్రి వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు తెలిసినప్రాంతాలు మొత్తం వెతికినా ఆమె జాడ దొరకలేదు. మంగళవారం ఉదయం మళ్లీ గాలింపు చేపట్టినప్పుడు ఎల్లయ్య చెరువు కట్ట వద్ద రాణికి చెందిన చెప్పులు కనిపించాయి. అనుమానం వ్యక్తం చేసి చెరువు ప్రాంతాన్ని పరిశీలించగా మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో చెరువు నీటిలో శవం తేలియాడుతూ కనిపించింది. కుటుంబ సభ్యులు ఆ శవం రాణిదేనని గుర్తించారు.మృతురాలు కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండటంతో నిరాశ చెంది స్వయంగా చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

