పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించిన సర్పంచ్ అరిగే ధర్మతేజ
On
బీర్కూర్, జూన్ 28(డిడి9 వార్త): మండల కేంద్రంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ అరిగే ధర్మతేజ ప్రారంభించారు.ఈ సందర్భంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేయించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఐదేళ్ల లోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ఆయన తల్లిదండ్రులకు సూచించారు. పోలియో నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని, ప్రతి చిన్నారికి చుక్కలు వేయించడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని తెలిపారు.కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Views: 50
Tags:
About The Author
Related Posts
Latest News
03 Sep 2026 23:48:46
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు....

