రెంజల్ కేజీబీవీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
By R.Suresh
On
నిజామాబాద్ జిల్లా రెంజల్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని గురువారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అకస్మాత్తుగా తనిఖీ చేశారు. పాఠశాల ఆవరణ అపరిశుభ్రంగా ఉండటంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల భద్రతను గమనించి, పరిసరాలను వెంటనే శుభ్రం చేయించాలని, ఆర్‌ఓ ప్లాంట్ మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం పౌష్టికాహారాన్ని అందించాలని, బయటి వ్యక్తుల రాకపై ఆంక్షలు విధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రవణ్, ఎంపీడీఓ కమలాకర్, స్పెషల్ ఆఫీసర్ శ్యామల పాల్గొన్నారు.
Views: 4
Tags:
About The Author
Latest News
03 Sep 2026 23:48:46
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు....

