బోధన్‌లో ఘనంగా గంగపుత్ర మరాఠా సంఘం ఆధ్వర్యంలో బోనాల వేడుకలు
భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బోనాల సమర్పణ
By R.Suresh
On
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ఏకచక్ర నగర్‌లో గంగపుత్ర మరాఠా సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగ మంగళవారం ఘనంగా జరిగింది. కాలనీకి చెందిన మహిళలు, కులస్తులు డప్పు వాయిద్యాల నడుమ బోనాలను నెత్తిన ధరించి ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు గటుమల్ సాగర్, వార్డు కౌన్సిలర్ గుమ్ముల అశోక్ రెడ్డి, సంఘ సభ్యులు సుభాష్, దశరథ్, తానాజీ, సీతారాం, గణేష్, దీపక్, పవన్, బాపూజీ, మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు.

Views: 53
Tags:
About The Author
Latest News
03 Sep 2026 23:48:46
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు....

