సర్కారీ బడుల్లో అందరికీ భోజనం..

మూసీ అభివృద్ధికి రూ. 7,345 కోట్లు

సర్కారీ బడుల్లో అందరికీ భోజనం..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో విద్యార్థులతో పాటు సుమారు 1.5 లక్షల మంది ఉపాధ్యాయులు, లెక్చరర్లు, సిబ్బందికి కూడా అల్పాహారంతో పాటు మధ్యాహ్న భోజనం అందించాలని మంత్రివర్గం నిర్ణయించింది.

కేంద్రం ప్రవేశపెట్టిన వీబీజీ రామ్‌జీ పథకం నిరుపేదల హక్కులను హరించేలా ఉందని భావిస్తూ, ఈ అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని మంత్రివర్గం నిర్ణయించింది. కేంద్రం రాష్ట్రాల భిన్నాభిప్రాయాలను పట్టించుకోకుండా ఈ పథకాన్ని అమలు చేస్తున్నందున, ఉపాధి హామీ కూలీలకు నష్టం జరగకూడదనే ఉద్దేశంతో అనివార్య పరిస్థితుల్లో దీనిని రాష్ట్రంలో కూడా కొనసాగించాలని నిర్ణయించారు.

వైద్య రంగంలో భారీగా ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సనత్‌నగర్, ఎల్‌బీ నగర్, అల్వాల్ టిమ్స్ మరియు వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో డాక్టర్లు, వైద్య సిబ్బంది కోసం 6,278 పోస్టులను మంజూరు చేశారు. ఈ ఆసుపత్రులను నిమ్స్ తరహాలో అభివృద్ధి చేయడంతో పాటు, వైద్య సేవలకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఎల్‌ఓసీలు జారీ చేయాలని నిర్ణయించారు.

హైదరాబాద్ మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టులో భాగంగా ఫేజ్-1లో గాంధీ సరోవర్ వరకు 21 కిలోమీటర్ల మేర పనులు పూర్తి చేసేందుకు పరిపాలనా అనుమతులు మంజూరు చేశారు. ఈ ప్రాజెక్టు అభివృద్ధి కోసం రూ. 7,345 కోట్లు మంజూరు చేస్తూ మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ధనసరి అనసూయ సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వెల్లడించారు.

Views: 9
Tags:

About The Author

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు