నకిలీ అక్రెడిటేషన్‌ కార్డుపై పోలీసులకు డీపీఆర్‌ఓ ఫిర్యాదు

నకిలీ అక్రెడిటేషన్‌ కార్డుపై పోలీసులకు డీపీఆర్‌ఓ ఫిర్యాదు

నిజామాబాద్‌ జిల్లాలో కలెక్టర్‌ సంతకం ఫోర్జరీ ఉదంతం తీవ్ర కలకలం రేపింది. వాట్సాప్‌తో పాటు ఇతర సామాజిక మాధ్యమాల్లో పి.శ్రీనివాస్‌ అనే వ్యక్తి పేరిట నకిలీ మీడియా అక్రెడిటేషన్‌ కార్డు చెలామణి అవుతున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. ఈ నకిలీ కార్డును సృష్టించేందుకు జిల్లా కలెక్టర్‌ ఇలా త్రిపాఠి సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు గుర్తించారు. దీనిపై స్పందించిన నిజామాబాద్‌ జిల్లా పౌర సంబంధాల అధికారి ఎన్‌.పద్మశ్రీ జిల్లా పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. సదరు అక్రెడిటేషన్‌ కార్డును సమాచార పౌర సంబంధాల శాఖ నిజామాబాద్ జిల్లా కార్యాలయం నుంచి జారీ చేయలేదని డీపీఆర్‌ఓ పద్మశ్రీ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. కలెక్టర్‌ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ కార్డును తయారు చేసిన సదరు వ్యక్తిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరారు. ఎవరైనా ఈ తరహాలో నకిలీ అక్రెడిటేషన్‌ కార్డులను తయారు చేసినా, లేదా వాటిని వినియోగించినా చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె ఈ సందర్భంగా హెచ్చరించారు.

Views: 13
Tags:

About The Author

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు