అధికార అహంకారం ప్రమాదకరం… ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేస్తే అదే ప్రజలు కిందికి దింపుతారు
విమర్శలు కాదు… గ్రామానికి నిధులు తెచ్చి అభివృద్ధి చేయండి
కాంగ్రెస్ పార్టీ నాయకులు, సీనియర్ జర్నలిస్ట్ కాదేపురం గంగన్న
బీర్కూర్, ఫిబ్రవరి 21(డిడి9 వార్త):
రాజకీయాల్లో ప్రతి ఒక్కరూ విలువలను పాటించాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, సీనియర్ జర్నలిస్ట్ కాదేపురం గంగన్న అన్నారు. బీర్కూర్ మండలంలోని బరంగ్ ఏడ్గి గ్రామంలో శనివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు.ప్రజా తీర్పును ఎంతటివారైనా శిరసావహించాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఎత్తుకున్నారని సంబరపడకూడదని, వారి నమ్మకాన్ని వమ్ము చేస్తే అదే ప్రజలు కిందికి లాగుతారని గుర్తుంచుకోవాలని సూచించారు. తమ గ్రామానికి చెందిన కొంతమంది నాయకులు శుక్రవారం చేసిన ప్రకటన బాధాకరమని అన్నారు.పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆగమేఘాల మీద సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారని చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు. బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధికి పోచారం చేసిన సేవలను గుర్తుచేస్తూ, ఆ ప్రాంతానికి విలువైన రాజకీయాలను నేర్పిన నాయకుడు ఆయనేనని అన్నారు.గ్రామాభివృద్ధికి తాము ఎప్పుడూ అడ్డుకాదని, తమ నాయకులు రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, నాయకులు కాసుల రోహిత్ సహకారంతో నిధులు తెచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఇతర నాయకులు కూడా గ్రామానికి నిధులు తీసుకువచ్చి అభివృద్ధికి కృషి చేయాలని సవాల్ విసిరారు.లేనిపోని విమర్శలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు గోండ్ల శ్రీనివాస్, ఏఎంసీ డైరెక్టర్ గోండ్ల రాజు, నాయకులు ఇందూర్ గజేందర్, ఫుల్కంటి హన్మంత్, కుర్మ నాగుగోండ, కోరె హావగిర్ రావు, హట్కరి దశరథ్, మొండికారి వీరప్ప, బుజ్జిగొండ, గాజుల గజేందర్, నీరడి రాములు, బసలింగప్ప, క్యాదెని లింగప్ప, సాలె సాయిబాబా, జాకారం గంగారాం తదితరులు పాల్గొన్నారు.

