బరంగ్ ఏడ్గిలో బడిబాట కార్యక్రమం.. విద్యార్థుల చేరికలపై అవగాహన

బీర్కూర్, జూన్ 11(డిడి9 వార్త):

మండలంలోని బరంగ్ ఏడ్గి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు గాజుల సంతు, మారుతీ ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలోని వీధుల్లో పర్యటిస్తూ తల్లిదండ్రులు, విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో అందుతున్న నాణ్యమైన విద్య, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, మధ్యాహ్న భోజనం తదితర సౌకర్యాల గురించి వివరించారు.ఈ సందర్భంగా పాఠశాల వయస్సు కలిగిన ప్రతి చిన్నారిని పాఠశాలలో చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం విద్య ఎంతో ముఖ్యమని, ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ విద్యా అవకాశాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.గ్రామ ప్రజలు, తల్లిదండ్రులు కార్యక్రమానికి సహకరించగా, ఉపాధ్యాయులు విద్యార్థుల నమోదు పెంపునకు కృషి చేయాలని సంకల్పించారు.ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ డైరెక్టర్ సందుల రవి, విద్యార్థులు పాల్గొన్నారు.

 

Views: 104
Tags:

About The Author

Related Posts

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు