బీర్కూర్‌లో భోగి సంబరాలు

సాంప్రదాయ వేడుకల్లో సర్పంచ్ ధర్మతేజ – గ్రామమంతా పండగ సందడి

బీర్కూర్,జనవరి 14(డిడి9 వార్త):

బీర్కూర్ పట్టణంలో బుధవారం భోగి పండగ వేడుకలతో పండగ వాతావరణాన్ని సంతరించుకుంది. పట్టణ కేంద్రంలోని రంగజీనగర్ కాలనీలో తెల్లవారుజామున నిర్వహించిన సంప్రదాయ భోగి మంటల కార్యక్రమంలో సర్పంచ్ అరిగే ధర్మతేజ పాల్గొని గ్రామ ప్రజలకు భోగి శుభాకాంక్షలు తెలిపారు.సూర్యోదయానికి ముందే భోగి మంటలు వేసి పాత వస్తువులను అగ్నికి ఆహుతి చేయడం ద్వారా చెడును దహించి కొత్తదనాన్ని ఆహ్వానించే సంప్రదాయాన్ని ప్రజలతో కలిసి సర్పంచ్ నిర్వహించారు. అనంతరం గ్రామ పరిధిలోని ప్రకాశరావు క్యాంప్ లో కుటుంబ సభ్యులతో కలిసి మరో భోగి కార్యక్రమంలో పాల్గొన్నారు.ఇదే సమయంలో బీర్కూర్ గాంధీచౌక్ లో ఉపసర్పంచ్ పరమేష్ పంతులు వారి బృందం ఆధ్వర్యంలో భోగి పండగ సందర్భంగా పిల్లలు, యువకులకు గాలి పాటల పంపిణీ జరిపి పండగ ఆనందాన్ని మరింత పెంచారు.ఈ సందర్భంగా సర్పంచ్ ధర్మతేజ మాట్లాడుతూ భోగి మంటలు అనేవి చెడును, ప్రతికూలతలను దహించి కొత్త జీవనానికి ప్రతీక. భోగి,సంక్రాంతి,కనుమ పండుగలు ప్రతి ఇంటా వెలుగు నింపాలి. రైతులకు మంచి దిగుబడి రావాలి, పాడిపంటలు లాభాలు తెచ్చిపెట్టాలి అని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో 13వ వార్డు సభ్యురాలు అరిగే గాయత్రి, 14వ వార్డు సభ్యుడు ఆనంద్, కాలనీవాసులు, ఏఎంసీ వైస్ చైర్మన్ యమా రాములు,నాయకులు మియపురం శశికాంత్,మాజీ ఎంపీటీసీ సందీప్ పటేల్,PACS మాజీ చైర్మన్ ఇంగు రాములు,వార్డు సభ్యులు, కొరిమె రఘు,హైమద్, లింగం, యువకులు, పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Views: 77
Tags:

About The Author

Related Posts

Latest News

సర్పంచ్‌కు ఘన సన్మానం సర్పంచ్‌కు ఘన సన్మానం
బీర్కూర్,జనవరి 15(డిడి9 వార్త) :  బీర్కూర్ గ్రామ సర్పంచ్ అరిగే ధర్మ తేజకి యువకుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా కిష్టాపూర్ ఉపసర్పంచ్...
వీరాపూర్‌లో లయన్స్ క్లబ్ సేవా హస్తం
విజేతలకు ట్రోఫీలు అందజేసిన మియ్యాపురం శశికాంత్
కామారెడ్డిలో కోయాల్కర్ కన్నయ్యా కుటుంబానికి షబ్బీర్ అలీ పరామర్శ
నెమ్లిలో గడ్డం విట్టల్ మాతృమూర్తి రుకవ్వకు నివాళులు – ₹5,000 ఆర్థిక సహాయం అందించిన గార్గే శ్రీనివాస్
బీర్కూర్‌లో భోగి సంబరాలు
గుమస్తా కాలనీలో నూతన సీసీ రోడ్ల ప్రారంభం