నెమ్లిలో గడ్డం విట్టల్ మాతృమూర్తి రుకవ్వకు నివాళులు – ₹5,000 ఆర్థిక సహాయం అందించిన గార్గే శ్రీనివాస్
నసురుల్లాబాద్, జనవరి 14(డిడి9 వార్త):
నసురుల్లాబాద్ మండలం నెమ్లి గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్త గడ్డం విట్టల్ మాతృమూర్తి రుకవ్వ బుధవారం మృతి చెందారు. ఈ విషాదవార్తను బీజేపీ నాయకుడు గార్గే శ్రీనివాస్ కి తెలియజేయగా, ఆయన తన వంతుగా ₹5,000 రూపాయల ఆర్థిక సహాయం అందించి కుటుంబాన్ని ఆదుకున్నారు.ఈ సందర్భంగా ఆయన రుకవ్వ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి తన సానుభూతిని తెలిపారు.ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు చందూరి హన్మాండ్లు,
నేమలి సర్పంచ్ రాంగోపాల్ రెడ్డి,ఉప సర్పంచ్ బండి సాయిలు,నసురుల్లాబాద్ మండల ఉపాధ్యక్షులు చందూరు సాయిలు,నెమ్లి బూత్ అధ్యక్షులు బండి లక్ష్మణ్ నారాయణ,సుక్కన్న, తోటి సాయికుమార్, గడ్డం గంగాబోయి, గడ్డం దత్తాత్రి, గడ్డం గంగారం
మరియు పలువురు బీజేపీ కార్యకర్తలు పాల్గొని కుటుంబానికి అండగా నిలిచారు.

