గుమస్తా కాలనీలో నూతన సీసీ రోడ్ల ప్రారంభం
కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరిన మహిళలు
కామారెడ్డి, జనవరి 13(డిడి9 వార్త) : కామారెడ్డి పట్టణంలోని గుమస్తా కాలనీలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కాలనీ ప్రజలతో పాటు పెద్ద సంఖ్యలో మహిళలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.రోడ్ల ప్రారంభోత్సవం అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో కాంగ్రెస్ పార్టీపై విశ్వాసం ప్రకటిస్తూ భారీ ఎత్తున మహిళలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన మహిళలకు షబ్బీర్ అలీ స్వయంగా కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ,"ప్రజల అభివృద్ధే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. మహిళల సాధికారత, మౌలిక వసతుల కల్పన, సంక్షేమ పథకాల అమలే మా ప్రధాన బాధ్యత" అని అన్నారు.ఈ కార్యక్రమంలో డీసీసీ మాజీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్,మండల అధ్యక్షులు గూడెం శ్రీనివాస్ రెడ్డి,పట్టణ అధ్యక్షులు పండ్ల రాజు,గుడుగుల శ్రీనివాస్,పెద్ద సంఖ్యలో మహిళలు, వార్డు ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

