విజేతలకు ట్రోఫీలు అందజేసిన మియ్యాపురం శశికాంత్
యువత అన్నిరంగాల్లో ముందుండాలి – బీర్కూర్ మండల నాయకుడు శశికాంత్
బీర్కూర్, జనవరి 15(డిడి9 వార్త) :
యువత చదువుతో పాటు క్రీడలు, సామాజిక సేవ, నాయకత్వం వంటి అన్ని రంగాల్లో ముందుండాలని బీర్కూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకుడు మియ్యాపురం శశికాంత్ అన్నారు.బీర్కూర్ మండలం కిష్టాపూర్ గ్రామంలో వివేకానంద యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్ బుధవారం ఘనంగా ముగిసింది. గత కొన్నిరోజులుగా కొనసాగిన ఈ టోర్నీలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన జట్లు ఉత్సాహంగా పాల్గొన్నాయి.ఈ పోటీల్లో బీర్కూర్ మహాత్మా జ్యోతిభాపులే పాఠశాల జట్టు మొదటి విజేతగా నిలవగా, కిస్టాపూర్ గ్రామ జట్టు రన్నరప్‌గా నిలిచింది. బుధవారం సాయంత్రం నిర్వహించిన బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కిస్టాపూర్ సర్పంచ్ బాన్సువాడ మానేవ్వ గంగోండ, బీర్కూర్ మండల కాంగ్రెస్ నాయకుడు మియ్యాపురం శశికాంత్ హాజరై విజేతలకు ట్రోఫీలు అందజేశారు.ఈ సందర్భంగా మియ్యాపురం శశికాంత్ మాట్లాడుతూ “యువత అన్నిరంగాల్లో ముందుండాలి. వారి అభివృద్ధికి అవసరమైన అన్ని విధాల సహాయ సహకారాలు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రో చైర్మన్ కాసుల బాలరాజు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి అందిస్తారు” అని తెలిపారు.క్రీడలు యువతలో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని, ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలని ఆయన ఆకాంక్షించారు.

