ఆడబిడ్డల ఆశల్ని నెరవేర్చిన కాంగ్రెస్ ప్రభుత్వం
ఎమ్మెల్యే చేతుల మీదుగా కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ లబ్ధిదారులకు ఆర్థిక భరోసా
బీర్కూర్, జనవరి 13(డిడి9 వార్త):
బీర్కూర్ మండలంలోని బరంగ్ ఏడ్గి గ్రామానికి చెందిన నాచారం స్రవంతి, రెంజర్ల శైలజ, బొజ్జ రమ్య లకు మంగళవారం కల్యాణలక్ష్మి పథకం కింద మంజూరైన చెక్కులను తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఘనంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ ప్రత్యేకంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ,
“కాంగ్రెస్ ప్రభుత్వం ఆడబిడ్డల భవిష్యత్తుకు అండగా నిలుస్తోంది. పేద కుటుంబాల పెళ్లిళ్లకు పథకం ఒక వరం. లబ్ధి పొందిన వారు ప్రభుత్వానికి అండగా నిలవాలి” అని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎఎంసీ డైరెక్టర్ గోండ్ల రాజు, పసుపుల రమేష్, కుమ్మరి గంగారాం, ఇందూర్ గజేందర్, హొక్నారి అశోక్, కాదేపురం గంగారాం, సిద్దంశెట్టి శివరాజ్, బోయి సాయిలు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొని వేడుకను ఘనంగా నిర్వహించారు.

