దామరంచ నూతన సర్పంచ్ బోయిని శంకర్‌కు ఘన సన్మానం

మియ్యాపురం శశికాంత్ ఆధ్వర్యంలో అభినందనలు

బాన్సువాడ, జనవరి 13(డిడి9 వార్త):

బీర్కూర్ మండలం దామరంచ గ్రామానికి నూతనంగా ఎన్నికైన సర్పంచ్ బోయిని శంకర్ ని మండల నాయకుడు మియ్యాపురం శశికాంత్ మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధికి కృషి చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్న సర్పంచ్ శంకర్ ని శాలువాతో ఘనంగా సన్మానించారు.గ్రామానికి మరింత మెరుగైన మౌలిక వసతులు, సంక్షేమ కార్యక్రమాలు అందించేందుకు ప్రజాప్రతినిధులు సమిష్టిగా పని చేయాలని ఈ సందర్భంగా నాయకులు ఆకాంక్షించారు. నూతన సర్పంచ్ బోయిని శంకర్ గ్రామ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ దామరంచ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఇంటెనుక శంకర్, వార్డు సభ్యులు కూర్మ లక్ష్మణ్, మంగలి అంబాజీ, సత్యనారాయణ తదితరులు పాల్గొని సర్పంచ్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.గ్రామంలో ఐక్యతతో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించాలని నాయకులు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

Views: 24
Tags:

About The Author

Related Posts

Latest News

సర్పంచ్‌కు ఘన సన్మానం సర్పంచ్‌కు ఘన సన్మానం
బీర్కూర్,జనవరి 15(డిడి9 వార్త) :  బీర్కూర్ గ్రామ సర్పంచ్ అరిగే ధర్మ తేజకి యువకుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా కిష్టాపూర్ ఉపసర్పంచ్...
వీరాపూర్‌లో లయన్స్ క్లబ్ సేవా హస్తం
విజేతలకు ట్రోఫీలు అందజేసిన మియ్యాపురం శశికాంత్
కామారెడ్డిలో కోయాల్కర్ కన్నయ్యా కుటుంబానికి షబ్బీర్ అలీ పరామర్శ
నెమ్లిలో గడ్డం విట్టల్ మాతృమూర్తి రుకవ్వకు నివాళులు – ₹5,000 ఆర్థిక సహాయం అందించిన గార్గే శ్రీనివాస్
బీర్కూర్‌లో భోగి సంబరాలు
గుమస్తా కాలనీలో నూతన సీసీ రోడ్ల ప్రారంభం