సర్పంచ్‌కు ఘన సన్మానం
On
బీర్కూర్,జనవరి 15(డిడి9 వార్త) :
బీర్కూర్ గ్రామ సర్పంచ్ అరిగే ధర్మ తేజకి యువకుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా కిష్టాపూర్ ఉపసర్పంచ్ హాట్కరీ కృష్ణ తన మిత్రులతో కలిసి బీర్కూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ ధర్మతేజని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానించారు.గ్రామాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న సర్పంచ్ ధర్మతేజ సేవలను కొనియాడుతూ యువత ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సన్మాన కార్యక్రమంలో కిష్టాపూర్ ఉపసర్పంచ్ హాట్కరీ కృష్ణ, బంక్ శ్రీనివాస్, సాయి వర్మ, నరేష్, భాస్కర్, మహేష్, శరత్, కల్లు మహేష్, రఘు, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.
Views: 58
Tags:
About The Author
Related Posts
Latest News
15 Jan 2026 16:51:47
బీర్కూర్,జనవరి 15(డిడి9 వార్త) :
బీర్కూర్ గ్రామ సర్పంచ్ అరిగే ధర్మ తేజకి యువకుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా కిష్టాపూర్ ఉపసర్పంచ్...

