అనారోగ్య బాధితుడికి సీఎంఆర్ఎఫ్ భరోసా!
బరంగేడ్గిలో లక్కపల్లి గంగొండకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు పంపిణీ
ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి – ఆగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ ఆదేశాలతో సిఎంఆర్ఎఫ్ అందజేత
బీర్కూర్, జనవరి 13(డిడి9 వార్త):
బీర్కూర్ మండలంలోని బరంగ్ ఏడ్గి గ్రామంలో మంగళవారం గ్రామ పెద్దల సమక్షంలో గ్రామానికి చెందిన ఇల్తెం పోషవ్వ కుమారుడు లక్కపల్లి గంగొండకి ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కును అందజేశారు.తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మరియు తెలంగాణ రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ ఆదేశాల మేరకు, అనారోగ్యంతో బాధపడుతున్న లక్కపల్లి గంగొండ ని ఆదుకునేందుకు ఈ ఆర్థిక సహాయాన్ని అందించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ,“ప్రజల కష్టసుఖాల్లో ప్రభుత్వం అండగా ఉంటుంది. ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం పేదల పాలిట వరం” అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ గోండ్ల రాజు, నాయకులు శివ దేశాయ్, పసుపుల రమేష్, కుమ్మరి గంగారాం, ఇందూర్ గజేందర్, హొక్నారి అశోక్, మొండ్కారి కామప్ప, కాదేపురం గంగారాం, ఫుల్కంటి హన్ముగొండ, సందుల రవి, హట్కారి నర్సింగ్, మొండ్కారి వీరప్ప, వడ్ల నాగయ్య, శావులం శంకర్, కోరె హావగిర్ రావు, చాకలి సురేష్, సిద్ధంశెట్టి శివరాజ్, హట్కారి దశరథ్, లక్కపల్లి మొగులుగొండ, ముత్యం సతీష్, మేత్రి చాందు, క్యాదని లింగప్ప, వడ్ల నారాయణ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

