వీరాపూర్‌లో లయన్స్ క్లబ్ సేవా హస్తం
బీర్కూర్, జనవరి 15(డిడి9 వార్త):
బీర్కూర్ మండలం వీరాపూర్ గ్రామంలో ఇటీవల చోటుచేసుకున్న దుర్ఘటనకు స్పందించిన బీర్కూర్ లయన్స్ క్లబ్ సభ్యులు మానవతా దృక్పథంతో సేవా కార్యక్రమం నిర్వహించారు.వీరాపూర్ గ్రామానికి చెందిన ప్రహాలద్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడంతో ఆయన కుటుంబం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది.
ఆయనకు 8, 6, 3 సంవత్సరాల వయస్సు గల ముగ్గురు చిన్నారులు మరియు 10 రోజుల పసికందుగా మొత్తం నలుగురు కుమార్తెలు ఉండగా, ఇంటి పెద్దదిక్కు కోల్పోయిన ఆ కుటుంబం దయనీయ పరిస్థితిలో ఉంది.ఈ విషయం తెలుసుకున్న సీనియర్ లయన్ కిషోర్ ప్రభుదాస్ మరియు బీర్కూర్ యువకులు గొల్ల రాహుల్ యాదవ్, రవి పటేల్ లు లయన్స్ క్లబ్ దృష్టికి తీసుకువచ్చారు. దీనికి వెంటనే స్పందించిన బీర్కూర్ లయన్స్ క్లబ్ సభ్యులు వీరాపూర్ గ్రామానికి వెళ్లి ఆ కుటుంబానికి సుమారు రూ.10,000 విలువైన ఇంటి సామగ్రి, 50 కేజీల బియ్యం, పిల్లలకు బట్టలు, ఇంటికి అవసరమైన కిరాణా సరుకులు అందజేశారు.ఈ సేవా కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు సితలే రమేష్, సెక్రటరీ జెట్టి రవీందర్, ట్రెజరర్ మేకల గాలయ్య, జోన్ చైర్మన్ కొట్టురీ సంతోష్, సీనియర్ లయన్స్ సభ్యులు మేకల విఠల్, కిషోర్ దాస్, M.A. రషీద్, వీరయ్య సెట్, కార్తీక్ పటేల్, సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.లయన్స్ క్లబ్ సభ్యుల సేవా కార్యక్రమాన్ని గ్రామస్తులు హర్షాతిరేకాలతో అభినందించారు.

