బీర్కూర్‌లో రూ.10 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ
సర్పంచ్ అరిగే ధర్మతేజ చేతుల మీదుగా పనుల ప్రారంభం
On

బాన్సువాడ, జూలై 18(డిడి9 వార్త): కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలోని రామాలయం ఎదురుగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రూ.10 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు గ్రామ సర్పంచ్ అరిగే ధర్మతేజ భూమి పూజ నిర్వహించి పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ అరిగే ధర్మతేజ మాట్లాడుతూ, గ్రామ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే గ్రామపంచాయతీ లక్ష్యమని తెలిపారు. గ్రామ అభివృద్ధికి అవసరమైన పనులను దశలవారీగా పూర్తి చేస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బీర్కూర్ తహసీల్దార్ సవాయి సింగ్, సొసైటీ చైర్మన్ కొల్లి గాంధీ, ఉప సర్పంచ్ పరమేష్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ యామ రాములు, మాజీ ఎంపీపీ రఘు, వార్డు సభ్యులు నవీన్, భాస్కర్, హైమద్, మహేష్, విజయ్ ప్రకాష్, ఆనంద్ పటేల్, విట్టల్ తదితరులు పాల్గొన్నారు
Views: 93
Tags:
About The Author
Related Posts
Latest News
03 Sep 2026 23:48:46
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు....

