బీర్కూరులో సి.సి. రోడ్డు నిర్మాణానికి భూమి పూజ
బాన్సువాడ, జూలై 23 (డిడి9 వార్త):
బీర్కూరు మండల కేంద్రంలో గురువారం సి.సి. రోడ్డు నిర్మాణ పనులకు సర్పంచ్ ఆరిగే ధర్మతేజ భూమి పూజ నిర్వహించారు.మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంఎన్‌ఆర్‌ఈజీఎస్) నిధుల ద్వారా మంజూరైన రూ.10 లక్షల వ్యయంతో ఆర్‌అండ్‌బీ రోడ్ నుంచి తహసిల్దార్ కార్యాలయం వరకు సి.సి. రోడ్డు నిర్మాణం చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.ఈ సందర్భంగా సర్పంచ్ ఆరిగే ధర్మతేజ మాట్లాడుతూ, ప్రజలకు దీర్ఘకాలం ఉపయోగపడేలా నాణ్యతా ప్రమాణాలతో రోడ్డు నిర్మాణం చేపట్టాలని కాంట్రాక్టర్‌కు సూచించారు.పనులు పారదర్శకంగా, నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా పూర్తి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో తహసిల్దార్ సవాయి సింగ్, 13వ వార్డు సభ్యురాలు గాయత్రీ ధర్మతేజ, 4వ వార్డు సభ్యుడు రాహుల్, కుర్రి కృష్ణ, చామకూర రాజు, బస్వరాజ్, మేకల రాములు, శ్రీకాంత్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.

