బీర్కూర్ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల (పీఎం-శ్రీ) విద్యార్థుల హైదరాబాద్ విజ్ఞాన–విహారయాత్ర

బీర్కూర్,జనవరి 06(డిడి9 వార్త):

బీర్కూర్ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల (PM SHRI) నుండి 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఎక్స్పోజర్ సందర్శన కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు హైదరాబాద్ నగరానికి విజ్ఞాన–విహారయాత్రకు బయలుదేరారు. విద్యార్థుల్లో విజ్ఞానపరమైన అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని పాఠశాల యాజమాన్యం ఏర్పాటు చేసింది.ఈ సందర్భంగా బీర్కూర్ గ్రామ సర్పంచ్ ధర్మతేజ, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ పద్మ, విటల్, దుంపల రాజు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శివరాం, కాకయ్య, ప్రసాద్, లక్ష్మీ, భరత్, దశరథ్, శ్రీనివాస్, విద్యాసాగర్, ఉదయ భాస్కర్, సోమేశ్వర్ తదితర ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి పాల్గొన్నారు.హైదరాబాద్ పర్యటనలో భాగంగా విద్యార్థులు విజ్ఞాన కేంద్రాలు, చారిత్రక ప్రదేశాలు, సాంకేతిక విజ్ఞాన ప్రదర్శన కేంద్రాలు సందర్శించి తమ జ్ఞానాన్ని మరింతగా విస్తరించుకునే అవకాశం లభిస్తుందని ఉపాధ్యాయులు తెలిపారు. ఈ యాత్ర విద్యార్థుల భవిష్యత్ విద్యా జీవితానికి ఎంతో ఉపయోగకరమని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు పాఠశాల యాజమాన్యాన్ని, ఉపాధ్యాయ బృందాన్ని గ్రామ పెద్దలు అభినందించారు.

Views: 130
Tags:

About The Author

Related Posts

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు